కదం తొక్కిన పత్తి రైతులు, జాతీయ రహదారిపై రాస్తారోకో, **

Published: Saturday December 31, 2022
క్వింటాలుకు రూ 12 వేలు చెల్లించాలని **
 
కలెక్టరేట్ ముందు నిరసన, కలెక్టర్ కు వినతిపత్రం **
 
అసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 30 (ప్రజాపాలన, ప్రతినిధి) : పత్తి కి గిట్టుబాటు ధర రూ 12 వేలు చెలించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం పత్తి రైతులు కదం తొక్కారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. జిల్లా రైతుహక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులు అసిఫాబాద్ ఛత్రపతి శివాజీ భవనం నుండి ప్రారంభం అయిన రైతు ర్యాలీ పలు వీదుల నుడి  అంబేద్కర్ చౌక్ వద్దకు చేరుకున్నారు. అనంతరం అంతర్జాతీయ రహదారిపై బైఠాయించారు. వీరికి అన్ని కుల సంగాలు,రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ. రోజురోజుకు పత్తి ధర తగ్గుతుందని దీనితో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు.ఈ సంవత్సరం అధిక వర్షాలు పడటం ధ్వరా పంట దిగుబడి తగిందని,విత్తనాలు,ఎరువుల ధరలు పెరగడంతో పంటకి పెట్టుబడి చాలా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు, పంట వెళ్లే సమయంలో క్వింటాలకు 9వేలకు పైగా ఉండగా ఇప్పుడు మాత్రం రూ 7500,మాత్రమే ఉందని అన్నారు, జిన్నింగ్ మిల్ యజమానులు,,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను చాలా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు,ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు,వెంటనే సిసిఐ మద్దతు ధర క్వింటాలకు 12 వేలు పెంచాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.అనంతరం అక్కడి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ఎదుట బైఠాయించారు,అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ కి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు,ఈ సంధర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుక వెల్లుతానని,అలాగే రైతు నాయకులు,జిన్నింగ్ యాజమాన్యం తో చర్చలు జరిపి మద్దతు ధర పెంచడానికి కృషి చేస్తానన్నారు, దాదాపు 2గంటలు సాగిన ధర్నాతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ శ్రీనివాస్  ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు.
 ఈ కార్యక్రమంలో బిసి సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేష్,,రేగుంట కేశవరావు,రైతు సంఘం నాయకులు,గడ్డల సురేష్,గాజుల జక్కయ్య,మిట్ట తిరుపతి, వెంకటేశం,బట్టుపల్లి జయరాం,ప్రవీణ్, ప్రభాకర్,కాగ్రెస్ పార్టీ నాయకులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావ్, మర్స కోల సరస్వతి, తిరుపతి,అరుణ్, జిల్లాలోని పలు మండలాల రైతులు తదితరులు పాల్గొన్నారు.