గొర్రెల కు బదులు నగదు బదిలీ చేయాలి.

Published: Friday August 05, 2022
జీ యం పి యస్ కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్
కరీంనగర్ ఆగస్టు 4 ప్రజాపాలన :
గొర్రెల మేకల పెంపకదార్ల సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సందబొయిన ప్రసాద్ యాదవ్ అధ్యక్షతన కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ కు మరియు జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్ మాట్లాడుతూ మొదటి విడత గొర్రెల పంపిణీ లో అనేక అవకతవకలు జరిగి గొల్ల కురుమలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని బ్రోకర్ లు మరియు కొంతమంది పశు వైద్య అధికారులు మాత్రమే లాభపడ్డారు అని అన్నారు. ఇప్పుడు ఇస్తామంటున్న గొర్రెల పంపిణీ లో గొర్రెల కు బదులు నగదు బదిలీని రైతు బంధు లాగా అమలు చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు. గొర్లకాపరులైన గొల్ల కురుమల జీవితాల్లో నిజమైన వెలుగు నింపాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తే నగదు బదిలీ ఒక్కటే ప్రత్యామ్నాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకదార్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జీల్ల ఎల్లయ్య, వేల్పుల కొంరయ్య, జెట్టి కొమురెల్లి, సహాయ కార్యదర్శి పొనగాని మహేష్,భూస అయిలయ్య, మెరుగు సాయి కృష్ణ, తమ్మనవేణి ఓదేలు, బి అజయ్ తదితరులు పాల్గొన్నారు.