మట్టి మనిషి కామ్రేడ్ కృష్ణమూర్తి 15 వ వర్థంతి

Published: Monday August 02, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 1 ప్రజాపాలన ప్రతినిధి : నైజాం రజాకార్ల భూస్వాములను గడగడలాడించి వేలాది ఎకరాల భూములు పంచిన మట్టి మనిషి పేదోళ్ళ గుండెల్లో చిరకాలం నిలిచిన జనహృదయనేత కామ్రేడ్ కాచం కృష్ణ  మూర్తి 15వ వర్ధంతి ఇబ్రహీంపట్నం యాచారం మండలంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో యాచారం మండల కేంద్రంలో కామ్రేడ్ కృష్ణమూర్తిగారి 15 వ వర్ధంతి జరిగింది ఈ సందర్భంగా. వ్య కా స.జిల్లా జాయింటు సెక్రెటరీ  పి  అంజయ్య మాట్లాడుతూ అప్పటి జనగామ తాలూకా నిర్మల గ్రామంలో రామచంద్రయ్య యశోదమ్మల తొలి సంతానం 1921లో జన్మించాడు. భూస్వాముల జాగీర్దార్ల అరాచకాలకు దోపిడీలకు గురవుతున్న ప్రజల్ని విముక్తి చేయాలని. భూమికోసం భుక్తి విముక్తి కోసం జరుగుతున్న తెలంగాణ సాయుధ రైతంగా పోరాటంలో బంధుకులుపట్టి ప్రజలను చైతన్యం చేసి భూస్వాముల రజాకర్లను తరిమికొట్టి ప్రజలను బానిస సంకెళ్ల నుండి విముక్తి చేసినాడు ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగి ఇబ్రహీంపట్నం ప్రాంతంలో  ఎర్రజండా నాయకత్వంలో ప్రజలను చైతన్యం చేసి పెద్దఎత్తున్న భూపోరాటాలు చేసి  భూస్వాముల కబంధ హస్తాల్లో ఉన్నవేలాది ఎకరాల ప్రభుత్వ భూములు బయటికి తీసి పేదప్రజలకు పంచిన ఇచ్చిన  మహా యోధుడు కామ్రేడ్ కృష్ణ మూర్తి. రాబోయే రోజుల్లో కృష్ణ మూర్తి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పని చేయాలంటే  కూలీ కోసం భూమి భుక్తి విముక్తి కోసం చైతన్య పరుస్తూ. పోరాటాలకు సిద్ధంకావాలని ఈ సందర్బంగా తెలియజేసారు  కార్యక్రమంలో మండల అధ్యక్షులు సిహెచ్ సత్యం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి బ్రహ్మయ్య ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్ జిల్లా ఉపాధ్యక్షులు ఏ జంగయ్య. సోమయ్య. కూలీలు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.