దళిత వృత్తిదారులకు హామీలు అమలు పరచలేని ప్రభుత్వం

Published: Tuesday July 27, 2021
ఇబ్రహీంపట్నం, జులై 26, ప్రజాపాలన ప్రతినిధి : నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో ఆర్డిఓ వెంకటాచారి వినతి పత్రం అందజేశారు రాష్ట్రంలో చెప్పులు కుట్టే వృత్తిదారులకు, డప్పు కొట్టే దళిత కళాకారులకు రూ.5,000 వేల పింఛన్‌ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తుర్కయంజాల్ మున్సిపాలిటీ దళిత మోర్చ ఆధ్వర్యంలో డిమాండ్ చేయుట గురించి. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామని ప్రగల్భాలు పలుకుతున్నా.. క్షేత్రస్థాయిలో దళితులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. తెలంగాణ నమూనా – నాణేనికి మరోవైపులా ఉంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడినే మొదటి ముఖ్యమంత్రిగా చేస్తానని, లేకపోతే తల నరుక్కుంటానని చెప్పిన తెరాస పార్టీ అధినేత తన మాట తప్పి దళితులను మాయ చేశారు. దళితులపైన  వివక్ష వారికి సంబంధించిన హామీలు, పథకాలలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ తుర్కయంజల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ లేఖ ద్వారా మీ ముందుకి తీసుకువస్తున్నాము. అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమం ముసుగులో కొత్త రాష్ట్రంలోని ఈ TRS ప్రభుత్వం తనదైన రీతిలో వనరుల దోపిడి, హక్కుల ఉల్లంఘన, వ్యవస్థల విధ్వంసాలకు పాల్పడింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారం అందుకున్న ముఖ్యమంత్రి రాజ్యాంగ నైతికతను మాత్రం వెయ్యి అడుగుల లోతులో బొంద పెట్టారు. మానిఫెస్టోల్లోని హామీలను అమలు చేయకపోవడమేగాక, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా పాలన చేయడం ద్వారా రాజ్యాంగ పరంగా అనైతికతకు కూడా పాల్పడుతున్నారు. ముఖ్యంగా మిగులు బడ్జెట్ కలిగిన అత్యంత సంపన్న రాష్ట్రమని చెప్పుకుని ఆ సంపద పంపిణీ మాత్రం సముచితంగా, అసమానతలు రూపుమాపే విధంగా చేయలేదు. ఈ ప్రభుత్వ హయాంలో సమాజంలోని అత్యంత బలహీనులైన, వెనుకకు నెట్టివేయబడిన వర్గాలు ముఖ్యంగా దళితులకు ప్రతీ సారి ఏదో ఒక పేరు పెట్టి అన్నీ ఇస్తామని చెప్పి ఏది అందించకుండా వారిని మోసం చేస్తూనే ఉంది. దళిత ప్రజలను మరియు దళిత మేధావులను తన రాజకీయ ఓటు బ్యాంకు కోసం వాడుకుంటూ. యావత్ దళిత జాతిని మోసం చేస్తున్న ఈ అధికార పార్టీకి ప్రజలు త్వరలోనే బుద్ది చెపుతారు.ఇక నైనా డప్పు కళాకారులకు మరియు చెప్పులు కట్టుకునే వృత్తి దారులకు కూడా నెలకు 5,000 రూపాయల పింఛను అందించే ప్రక్రియ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మీకు భారతీయ జనతా ఎస్సీ మోర్చా తుర్కయంజాల్ మున్సిపాలిటీ డిమాండ్ చేస్తూ, మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ  కార్యక్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు తూళ్ల నరసింహ గౌడ్ .రాష్ట్ర బీజేవైఎం ఫోటో కాల్ కన్వీనర్ నోముల కార్తీక్. బిజెపి ఎస్సీ మోర్చ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బచ్చిగళ్ల రమేష్. సీనియర్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు కాంచనాని దాస్. సీనియర్ నాయకుడు పలుస శ్రవణ్ కుమార్ గౌడ్. మున్సిపల్ బిజెపి ప్రధాన కార్యదర్శులు మాలు శ్రీకాంత్ రెడ్డి. యంజాలా శ్రీనివాస్ రెడ్డి బీజేవైఎం నాయకులు మల్లెల ప్రేమ్సాయి. మల్లెల దేవేందర్. బిజెపి మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు మైలారం బాబు. సురేందర్ గౌడ్ మహిళా మోర్చ జిల్లా అధికార ప్రతినిధి రజినీ రెడ్డి. బి సి మోర్చా అధ్యక్షుడు మోహన్ గౌడు. అజయ్ గౌడ్ తదితరులుుు పాల్గొన్నారు