పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహా ఆహ్వాన శుభలేఖలు మరియు గిఫ్ట్ గడియారాల పంపిణీ మధ

Published: Tuesday July 19, 2022
జూలై 18 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు ఆగస్టు 17వ తేదీన ఖమ్మంలో జరిగే ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి  కుమార్తె రిసెప్షన్ కార్యక్రమానికి  గ్రామాల్లో ప్రజలు అందరూ హాజరవ్వాలని ఈరోజు ఆహ్వాన శుభలేఖలు మరియు గిఫ్ట్ గా గోడ గడియారాలను ప్రజలకు అందించే కార్యక్రమాన్ని పండుగగా నిర్వహించి సిరిపురం మరియు వంగవీడు గ్రామంలో టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు *డా.కోట రాంబాబు*  చేతుల మీదుగా మహిళలకు ఇచ్చి ప్రారంభించారు. గ్రామ ప్రజలు అందరూ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై  నూతన వధువరులను ఆశీర్వదించి  శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి  ఇచ్చే ప్రేమ విందు భోజన కార్యక్రమంలో పాల్గొనాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో టీఆరెఎస్ పార్టీ నాయకులు యన్నం కోటేశ్వరరావు , కటికల సీతరామిరెడ్డి , వేమిరెడ్డి లక్ష్మారెడ్డి , అమరవాది సత్యం రెడ్డి , చీదిరాల వెంకటేశ్వరరావు , అక్కినపల్లి నాగేశ్వరరావు , గ్రామ సర్పంచ్ లు బుచ్చిరెడ్డి , వీరారెడ్డి , బండి వెంకటేశ్వర్లు , మరియు ఎంపిటిసి లు మరియు మహిళలు గ్రామస్థులు, పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.