దాచారం గ్రామంలో అధికారులు లేని పౌర హక్కుల దినోత్సవం

Published: Wednesday March 31, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 30 ( ప్రజాపాలన ) : గ్రామంలోని ప్రజలందరూ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఒకరికొకరు సహకారం అందిస్తూ జీవించాలని ఆర్ఐ వదిత్య మోహన్ హితవు పలికారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని ద్యాచారం గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని గ్రామ సర్పంచ్ ఎల్లన్నోల్ల ఆంజయ్య అధ్యక్షతన నిర్వహించారు. పౌర హక్కుల దినోత్సవానికి ముఖ్య శాఖలు పోలీస్, దేవాదాయ, మండల పరిషత్ అధికారులు గైర్హాజరయ్యారు. తూతూ మంత్రంగా నామ్ కే వాస్తే పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు హాజరుకాకపోవడంతో గ్రామ ప్రజలు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. గ్రామ ప్రజల ఆవేదనను వినే అధికారులే డుమ్మాకొట్టడం వలన అరణ్యరోదనగా మారింది. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి పుష్ప, హాస్టల్ వార్డెన్ ప్రవీణ్ రెడ్డి, విఆర్ఎ గోపాల్, గ్రామస్థులు పాల్గొన్నారు.