ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 6ప్రజాపాలన ప్రతినిధి *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమా

Published: Wednesday December 07, 2022

ఇబ్రహీంపట్నం మున్సిపల్ దళిత మోర్చా అధ్యక్షుడు నౌసుదాసు ఆధ్వర్యంలో  అంబేద్కర్ 66వ వర్ధంతిని మంగళవారం నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీనవర్గాల వికాసానికి పాటుపడిన మహానేత
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66 వ వర్ధంతిని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న  అంబేద్కర్ విగ్రహానికి  బిజెపి నాయకులు పూలమాలలతో సత్కరించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాయని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముత్యాల భాస్కర్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని, వర్ధంతిని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకొని, ఆయన రచించిన రాజ్యాంగాన్ని గుర్తుచేసుకొని ప్రతి ఒక్కరు పాటించాలని ఆయన కోరారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్ రెడ్డి మాట్లాడుతూ...స్వాతంత్య్ర సమరయోధుడు,రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత,అన్నివర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన గొప్ప నేత, భారతరత్న డా.బి.ఆర్ అంబేడ్కర్ నిరుపేద కుటుంబం నుండి వచ్చి వీధిలైట్ల కింద చదువుకొని ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి  అని కొనియాడారు.దేశంలో అంటరానితనం రూపుమాపడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఆలోచనలు ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు. విద్యార్థులు ప్రజలందరూ అంబేద్కర్ కోరుకున్న భారతదేశ నిర్మాణానికై పాటుపడాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ముత్యాల భాస్కర్, నాయిని సత్యనారాయణ, జక్క రవీందర్ రెడ్డి, బూడిది నరసింహ్మ రెడ్డి, బండి మహేష్ , కొండ్రు శీను,  బాబు , ముత్యాల మహేందర్,  కాలి రూపక్ ,చెరుకూరి సురేష్  తదితరులు పాల్గొన్నారు.