జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో షి,టీం ఎస్సై రమాదేవి విద్యార్థులకు అవగాహన సదస్సు. బూ

Published: Saturday November 05, 2022
భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా షి,టీం  ఎస్సై  రమాదేవి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఎర్పాటు చేశారు.ఈ సందర్భంగా భద్రాద్రి షి,టీం  ఎస్సై రమాదేవి మాట్లాడుతూ పాఠశాల,కళాశాలలో,బస్టాప్ మరియు గ్రామాల్లో, పలు ప్రదేశాల్లో,ఇతర ప్రాంతాలలో ఎవరైనా ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తూ కనిపిస్తే వెంటనే షీ టీం పోలీస్ హెల్ప్‌లైన్ నెంబర్ 7901145721 కు లేదా డయల్ 100కు కాల్ చేయాలని కొందరు విద్యార్థినిలు,విద్యార్థులు తప్పుడు దోవలో అడుగులు వేస్తున్నారని మీ జీవితాలు మీరే నాశనం చేసుకుంటున్నారని అలా మా దృష్టికి వస్తె చట్టపరమైన చర్యలకు మీరు బాధ్యులు అవుతారని అమే అన్నారు,అబ్బాయిలకు దూరంగ ఉండడం మంచిదని స్నేహితులను,బంధువును సైతం నమ్మి ఎవరితో ఫోటోలు దిగొడ్డు అని,మీ చిత్రాలను ఎవరితో పంచుకోవద్దని అలా ఫొటోలు దిగిన కొందరు కామాంధులు వాటిని వేరే రూపం దిద్ది మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మిమ్మల్ని లొంగదీసుకుంటారని విద్యార్థులకు ష,టీం  ఎస్సై రమాదేవి వివరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక బూర్గంపహడ్ అదనపు  ఎస్సై రమణా రెడ్డి మాట్లాడుతూ  విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడుతూ చేడిపోతున్నరని,విద్యార్థులు మొబైల్ ఫోన్లకి దూరంగా ఉండాలని ఫోన్లో ఫేస్ బుక్,ఇంస్టాగ్రామ్,వాట్సప్ తదితర యాప్ ల,ద్వారా ఎందరో విద్యార్థుల జీవితాలు ఆగం అయ్యి రోడ్డున పడ్డాయి అని ఫోన్ల వల్ల జరిగే హాని పట్ల విద్యార్థులకు వివరించారు,కళాశాల చుట్టుప్రక్కల ప్రాంతాల్లో,బస్ ప్యాలెస్ల చుట్టు పక్కల అమ్మాయిల వెంట పడే ఆకతాయిలు పోకిరీల వాహనాల నెంబర్లను గమనించాలని వీలైతే వెంటఠనే 100 కి సమాచారం ఇవ్వాలని లేదా ఎవరికి భయపడకుండా నేరుగా పోలిస్ స్టేషన్ కి వచ్చి తమ సమస్యలు తెలుపాలని అన్నారు,ఇప్పటికే కొంతవరకు ఆకతాయిల ఆటలు సాగకుండా ప్రత్యేక నిఘా పెట్టి కౌనిస్లింగ్ లు ఇస్తున్నాం అని,అతి కొద్ది రోజుల్లోనే మిగిలిన పోకిరీల పంతం పడతా అని దీనికి ముందుగా కళాశాల అధ్యాపకులు విద్యార్థులు సహకరించాలని విద్యార్థుల పై కేసులు నమోదు చేసేటప్పుడు మాకు బాధకలుగుతున్నదని, కానీ చట్ట ప్రకారం తప్పదని కావునా విద్యార్థులు తల సవరాలు రకరకాలుగా ఉండకుండా విద్యార్థిగా ఉండాలని,విద్యార్థినులపై వేధింపులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరిలను అరెస్టు చేసి చట్టప్రకారం బాధితులను రక్షించడం ఇవ్ టీజర్ ల పంతం పట్టేందుకు మఫ్టీలో ప్రత్యేక టీంలు ఉన్నాయి అని,బస్ ప్యాలెస్ ల సమిపాల్లో గుంపులుగా ఉండవద్దు అని అదే విధంగా గ్రామ యువత కళాశాల ప్రాంగణాల్లో,సెంటర్ సమీపంలో ఉండవద్దు అని కళాశాల,పాటశాల నడిచే సమయాల్లో కనిపిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని యువత,ప్రజలు సహకరించాలని కోరారు.ఈ కర్యక్రమంలో బాగంగా కళాశాల ప్రిన్సిపాల్ చీన్యా మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తుకి బాటలు వేసుకునేందుకు ఇంటర్ మీడియట్ ఏ తోలి మెట్టు అని విద్యార్థులు ఎవరు పోన్లు వాడోద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నాగయ్య కళాశాల సీనియర్ తెలుగు అధ్యాపకులు సి.హెచ్ నాగేశ్వరావు,అధ్యాపక బృందం ఎన్.ఎస్.ఎస్ పి.ఓ జి.శ్రీనివాస్,సుమన్ కుమార్,డి.శ్రీనివాస్,ముకుందం,సాహితీ,నరేష్, శివ,జరీనా,శ్రీను,రేష్మా నాన్ టీచింగ్ స్టాప్ విద్యార్థులు పాల్గొన్నారు.