జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

Published: Wednesday February 09, 2022
మధిర ఫిబ్రవరి 8 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చేతుల మీదుగా నిరుపేద కుటుంబాలకు అండగా సీఎం సహాయనిధి చెక్కులు మంగళవారం నాడు మధిర మున్సిపాలిటీ పరిధిలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూఇప్పటికే మధిర నియోజకవర్గంలో వందలాది మందికి CMRF చెక్కులు అందించాం సీఎం సహాయ నిధితో మధిర నియోజకవర్గంలో వందలాది  కుటుంబాలకు భరోసా కల్పించిన TRS సర్కారుమధిర పట్టణ పరిధిలో 4,41,500/- రూపాయల విలువ చేసే 11 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు పంపిణీ చేశారు మధిర మున్సిపాలిటీ పరిధిలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి CMRF చెక్కులు అందించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని, పేద, మధ్య తరగతి కుటుంబాల వారు వైద్యం కోసం ఆర్దిక ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్  సహృదయం తో ఆలోచించి సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందిస్తున్నట్లు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు..మంగళవారం నాడు మధిర మున్సిపాలిటీ పరిధిలో మధిర టౌన్, మడుపల్లి, అంబారుపేట లో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన CMRF చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నియోజకవర్గంలో వందలాది మందికి CMRF చెక్కులను పంపిణీ చేశామన్నారు దీనితో వందలాది కుటుంబాలకు TRS సర్కారు భరోసా కల్పించిందని ఆయన తెలిపారు.. పలు అనారోగ్య సమస్యలతో వివిధ రకాల హాస్పిటల్స్ నందు చికిత్స పొందిన అనంతరం అక్కడ వారికి అయిన ఖర్చులను ఇప్పించి ఆదుకోవాలని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందిస్తున్నారన్నారు.. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు CMRF చెక్కులు వేల మందికి ఎక్కడో ఒకరికి మాత్రమే వచ్చేవని కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత TRS సర్కారు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.. పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయం ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కనుమూరు వెంకటేశ్వరావు సత్యంబాబు దొడ్డ మురళి శ్రీనివాస్ అప్పారావు బత్తుల శ్రీను మున్సిపల్ చైర్మన్ మొండితోక లత మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరావు వార్డు కౌన్సిలర్ రజిని శ్రీనివాస్ మల్లాది వాసు వైస్ చైర్మన్ విద్యా లత కౌన్సిలర్ లక్ష్మి ఓంకార్ మేడికొండ కళ్యాణి కిరణ్ మాధవి మధిర సేవ సమితి అధ్యక్షులు ప్రసాద్ కపిలవాయి జగన్ మోహన్ రావు టిఆర్ఎస్ నాయకులుు వెంకట్ రెడ్డి అనుబంధ సంఘాలు పాల్గొన్నారు