పశు వైద్య శిబిరం విజయవంతం

Published: Thursday December 01, 2022

మధిర రూరల్ నవంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధిమధిర మండలం దెందుకూరు గ్రామం బుధవారంం నాడు నందు స్థానిక సబ్ సెంటర్ గ్రామీణ పశు వైద్యశాల నందు ఈరోజు ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించినారుఈ వైద్య శిబిరంను సహాయ సంచాలకులు డాక్టర్ పండరి బాబు , పశువైద్యాధికారి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎదకురాని పడ్డలు, చూడి పరీక్షలు, గర్భకోశ వ్యాధులు, తిరిగి పోర్లి ఎదకు వచ్చే పశువులు మరియు ఇతర వ్యాధులకు, లేగ దూడలకు నట్టల మందులు త్రాగించి వ్యాధులకు చికిత్స చేసినారు, ఈ సందర్భంగా రైతులకు వివిధ రకాల సీజన్ వ్యాధుల పట్ల అవగాహన చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించినారుఈ వైద్య శిబిరములో ఐఎన్ఏ సిఏటి ఫార్మా కంపెనీ వారు పాల్గొని రైతులకు వారి కంపెనీ మందులను చూడి పశువులలో క్యాల్షియం ప్రయోజనాల గురించి అవగాహనపరిచి ఈ శిబిరం నందు మినరల్ మిక్చర్, క్యాల్షియం టానిక్, మరియు గర్భకోశ వ్యాధి మందులు ఉచితంగా పంపిణీ చేసినారుఈ శిబిరం నందు స్థానిక గ్రామీణ పశు వైద్య సబ్ సెంటర్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ లక్ష్మణరావు, సుధాకర్, కరిమూన్,  ఈ శిబిరిమనందు చికిత్స సేవలు అందించినారు మరియు పశుపోషకులు వట్టికొండ నాగేశ్వరరావు, తీర్థాల పుల్లయ్య, చావా వెంకటేశ్వరరావు, ఎడ్లపల్లి రమణ,వూట్ల మాధవరావు, తీర్థాల వంశీ, పిచ్చయ్య, పాల్గొన్నారు