పంచాయతీ కార్యదర్శి పై చర్య తీసుకోండిఎం.పీ.డీ.వో కు వినతి పత్రం

Published: Thursday September 23, 2021
వెల్గటూర్, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట గ్రామ కార్యదర్శి ప్రతి పనికి పైసలు తీసుకుంటున్నట్లు, పనుల కోసం వెళితే పైసలు ఇవ్వాలి వారిని ఇబ్బంది గురిచేస్తున్నారు.అలాగే ప్రతి పనికి ఒక రేటును నిర్ణయించి వసూలు చేస్తున్నాడు అని వెల్గటూర్ మండల అభివృద్ధి అధికారి సంజీవరావు ఫిర్యాదు చేశారు. బుధవారం సామాజిక తనిఖీల్లో భాగంగా గ్రామసభ నిర్వహించగా గ్రామస్తులు కార్యదర్శిపై ప్రతిపనికి వసూలు చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని గ్రామసభలో మాజీ ఎం.పి.టి.సి మాచర్ల రాజేందర్, అన్న నేను వెంకటేశ్వరరావు గ్రామ యువకులు గ్రామ కార్యదర్శి నిలదీశారు అనంతరం మండల అభివృద్ధి అధికారి సంజీవరావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెరక శ్రీనివాస్, పుదరి రమేష్, కాష్ ఆనందయ్య, పల్గునురి సత్యం, నైనాల మల్లేష్, తంగళ్ళపల్లి సతీష్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. మండల అభివృద్ధి అధికారి సంజీవరావు వివరణ కోరగా కిషన్ రావు పేట గ్రామ కార్యదర్శి ప్రజల దగ్గర ప్రతి పనికి పైసలు వసూలు చేస్తున్నట్లు గ్రామస్తులు వినతి పత్రం ఇచ్చిన మాట వాస్తవమే త్వరలో ఎంక్వయిరీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియ జేశారు.