పర్మినెంట్ కార్మికుల తో సమానంగా కాంట్రాక్ట్ కార్మికుల కూడా చికిత్స అందించాలి

Published: Tuesday May 04, 2021

బెల్లంపల్లి మే 3 ప్రజాపాలన ప్రతినిధి : అండర్ గ్రౌండ్ మైన్స్ లో పనిచేసే పర్మనెంట్ కార్మికులతో సమానంగా కాంటాక్ట్ కార్మికులకు కూడా కరోనా వైద్య చికిత్సలు అందించాలని సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ఒక ప్రకటనలో తెలిపింది. సోమవారం నాడు స్థానిక శాంతి ఖని గని కార్మికులకు మాస్క్ లను అందిస్తూ గని పై ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులకు కూడా రాపిడ్ యాంటిజెన్, ఆర్ టి పి సి ఆర్, సిటి స్కాన్ పరీక్షలు నిర్వహించి కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారన్నారు, అలాగే ఉపరితల గనుల్లో ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కార్మికులకు పనిచేస్తున్న చోటనే కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని  మెడికల్ క్యాంపులు  ఏర్పాటు చేసి  రెండవ సారి  కరోనా  వైరస్  విజృంభణ  దృష్ట్యా ప్రతి కార్మికుడికి  వారి కుటుంబ సభ్యులకు రాపిడ్ పరీక్షలు నిర్వహించి బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి ఇంటింటికి కరోనా పరీక్షలు నిర్వహించాలని తమ ప్రాణాలను  ప్రాణంగా పెట్టి ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ విధినిర్వహణలో కరోనా కారణంగా చనిపోయిన కార్మికులకు కోటి రూపాయల ఎక్స్ గ్రేసియ ఇవ్వాలని, కరోనా వైరస్ వల్ల చనిపోయిన కార్మికులకు గని ప్రమాదంగా పరిగనించాలని కరోనా వ్యాధికి గురైన కార్మికులకు నయం అయ్యే అంతవరకు స్పెషల్ లీవ్ క్రింద వేతనాలు ఇవ్వాలని, కార్పొరేట్  హాస్పిటల్స్ కు పంపకుండా మన ఏరియాలో ఉన్న హాస్పటల్లోనే వారికి ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి వైద్యం అందించాలని విధులకు హాజరయ్యే కార్మికులకు ప్రతిరోజు మాస్కులు సానిటైజర్లను సరఫరా చేయాలని లేనిపక్షంలో టి ఎన్ టి యూ సి ఆధ్వర్యంలో సంబంధిత మేనేజర్ కార్యాలయాలముందు ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని వారన్నారు, ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ఏరియా ఉపాధ్యక్షులు మనీరామ్ సింగ్, టీ ఎన్ టి యు సీ జిల్లా నాయకులు అమానుల్లాఖాన్, బెల్లంపల్లి రీజన్ అధ్యక్షులు గద్దల నారాయణ, సిహెచ్ ప్రకాష్, ఎండి బుకూర్, ఎండి, రియాజ్, బొల్లు మల్లయ్య, గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.