ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి డిప్యూటీ తాసిల్దార్ రాజేష్ సరుకుల వితరణ మధిర ఆగస్టు 23 ప్రజా ప

Published: Wednesday August 24, 2022

మానవసేవే మాధవసేవ అంటూ మతిస్థిమితం లేని వారిని వృద్ధులను చేరదీసి వారికి ఆశ్రయం కల్పిస్తున్న ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమానికి మధిర డిప్యూటీ తాసిల్దార్ రాజేష్  బియ్యం నిత్యవసర సరుకులు అందజేశారు. ఎంతోమందికి నేనున్నాను అంటూ ఆశ్రయం కల్పిస్తూ వారిని ఆదరిస్తున్న ఆర్కే ఫౌండేషన్ సేవలు ఎనలేనివి అంటూ ఈ సందర్భంగా రాజేష్  కొనియాడారు. ఈ సందర్భంగా ఆర్కె ఫౌండేషన్ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ జ్యోతి ఆర్కే రాజేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు