రైతుబంధు డబ్బులు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్

Published: Tuesday June 21, 2022

రైతు సంఘం నాయకులు ఆమన్ గంటి వెంకటేష్*

రంగారెడ్డి జిల్లా రైతు సంఘం నాయకులు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట సహాయం కోసం పంపించేసే రైతుబంధు డబ్బులు ఎంతవరకైనా మంజూరు చేయడం లేదని కానీ ఇప్పటికే  పీఎం కిసాన్ పథకానికి చెందిన డబ్బులు సరైన సమయంలో బ్యాంకు ఖాతాలో జమ అయిపోయాయని ప్రభుత్వం వెల్లడించింది రైతుల  కొద్ది పాటి వర్షాలు కురవడంతో భూములు సాగు చేసుకుంటున్నారు. అయినా కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేయలేదని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది మరింత ఆలస్యం కావడంతో రైతుబంధు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నానని గతంలో రైతులకు ఇలాంటి లోటులేకుండా చూసుకుంటామని రైతులకు అన్ని విధాలా ఆదుకుంటామని గొప్పలు చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులతో చెలగాటం ఆడుతున్నారని. లక్ష రూపాయల లోపు రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని గొప్పలు చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి రైతుబంధు డబ్బులు మంజూరు చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసి కొత్త రుణాలు  రైతులకు ఇవ్వాలని అన్ని విధాల ఆదుకోవాలని రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో రాబోయే రోజుల్లో రైతులు  ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని   అదే విధంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు కనీసం వృద్ధులకు కొత్త పింఛన్లు కూడా ఇవ్వలేదని రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు,