చిన్న కోలుకుంద గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం

Published: Thursday March 02, 2023
* తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేష్
వికారాబాద్ బ్యూరో 01 మార్చి ప్రజాపాలన :

తెలంగాణ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కొనసాగుతుందని తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేష్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని చిన్న కోలుకుంద గ్రామంలో రూ. 15 లక్షల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర పాలన నిర్వహిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో గ్రామాల అభివృద్ధి కొనసాగుతుందని కొనియాడారు. ప్రభుత్వ పరంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి అందంగా తీర్చి దిద్దుతామని చెప్పారు. ఆయన వెంట ఉపసర్పంచ్ యాదయ్య, అశోక్, రాచప్ప, బాలమణి, రామయ్య, రాములు, నరేశ్, రాంరెడ్డి తదితరులు ఉన్నారు.