అందరికి అన్నం పెట్టేందుకే రేషన్‌ కార్డుల పంపిణీ

Published: Wednesday July 28, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 27 జూలై ప్రజాపాలన : అందరికీ అన్నం పెట్టేందుకే రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ధారూర్ మండలంలోని ధారూర్ గ్రామ పంచాయతీలో లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డులు అందజేస్తామని తెలిపారు. ఆకలితో ఏ ఒక్కరూ ఉండకూడదని, పేదల కడుపు మూడు పూటలా నిండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు మంజూరు చేసిందన్నారు.
శ్రీరామ్ నగర్ తండాలో పరంజ్యోతి ఆలయం ప్రారంభం :
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ధన్నారం గ్రామానికి చెందిన 2వ వార్డు కౌన్సిలర్ చెనగాల రాములు ఆధ్వర్యంలో ధన్నారం సమీపంలోని శ్రీ రామ్ నగర్ కాలనీలో పరం జ్యోతి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించి పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి :
ధారూర్ మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. నిర్మాణంలో ఎక్కడ నాణ్యత లోపించకుండా కాంట్రాక్టర్లు జాగ్రత్త వహించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించే విధంగా అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ధారూర్ గ్రామ సర్పంచ్ చంద్రమోళి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షత కోస్నం వేణుగోపాల్ రెడ్డి, వికారాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి, కెరెల్లి మాజీ సర్పంచ్ సంతోష్, విజయ్ రాజుగుప్తా, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.