మహిళా సాధికారత పై ఉద్యమిద్దాం

Published: Wednesday September 01, 2021
మాచర్ల భారతి ఐద్వా ఖమ్మం జిల్లా కార్యదర్శి
మధిర, ఆగస్టు 31, ప్రజాపాలన ప్రతినిధి : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంAidwa మధిర మండల మహాసభ స్థానిక బోడేపూడి భవన్ నందు జరిగింది ఈ మహా సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి మాట్లాడుతూ మహిళా సాధికారత సాధన కోసం మహిళలందరూ ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు దేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న మతోన్మాద పోకడలు స్త్రీల స్వతంత్రం పై స్వేచ్ఛపై  ప్రభావం చూపుతున్నాయని అన్నారు ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చి మహిళలపై వేధింపులకు కారణం అవుతుందని మహిళలపై బాలలపై వేధింపులకు పెరుగుతున్నాయని వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి అని అన్నారు మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిని సత్వరం శిక్షించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు మహిళలు ఆర్థిక స్వావలంబన ద్వారానే కుటుంబాలు చక్కదిద్ది పడతాయని అన్నారు మహిళలు విద్య ఉపాధి అవకాశాలు మహిళల గౌరవాన్ని పెంచుతాయని రాజకీయ రంగంలో మహిళల పాత్ర కీలకంగా పెరగాలని కోరారు 5వ జిల్లా అధ్యక్షులు బండి పద్మ గారు ఐద్వా జిల్లా అధ్యక్షులు బండి పద్మ మాట్లాడుతూ మహిళా సమస్యలపై ఐద్వా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు ఉద్యమాలు నిర్వహించిన ఘనత ఐద్వా కి ఉందని అన్నారు గుర్తు చేశారు గ్రామీణ స్థాయి నుండి మహిళలు పడుతున్న పలురకాల సమస్యల పైన అధ్యయనం నిర్వహించి వాటి పరిష్కారానికి మహా సభల్లో తీర్మానం చేస్తున్నట్లు తెలిపారు మధిర నూతన ఐద్వా మండల కమిటీ ఎన్నిక అధ్యక్ష కార్యదర్శులు తేజావత్ వజ్రమ్మ ఎర్ర నాగుల రమణ మరియు ఉపాధ్యక్షులుగా వనమా లక్ష్మి వడి త్య రమణ శ్రీదేవి ధన లక్ష్మి హరిత అనంత దుర్గ భవాని మరియు 16 మంది తో నూతన కమిటీ ఎన్నిక అయింది