బహుజనులు ఏకమయితే సాధ్యం కానిదేదీ లేదని, రానున్నది బహుజనుల రాజ్యం

Published: Monday August 29, 2022
ప్రజాయద్ద నౌక గద్దర్
 
కరీంనగర్ ప్రజాతంత్ర ఆగస్టు 28 : బహుజనులంతా ఏకమయి రాజ్యాధికారాన్ని సాధించి తీరాలని,ఇందుకు దళిత బహుజనులు సంఘటితం కావాలని ప్రజాయద్ద నౌక గద్దర్ పిలుపు నిచ్చారు.కవి,రచయిత,గాయకుడు మచ్చ దేవేందర్  నేతృత్వంలో ఆదివారం స్ఖానిక రెవెన్యూ గార్డెన్ లో నిర్వహించిన బహుజన ధూం..ధాం.. కార్యక్రమంలో గద్దర్ పాల్హోన్నారు.ఈ సందర్బంగా గద్దర్‌ మాట్లాడుతూ ఎంతో‌మంది త్యాగ దనుల పునాదులపై ఏర్పడిన తెలంగాణ లో బహుజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. అనాది‌గా అట్టడుగు వర్గాల ప్రజలు అల్లాడుతున్నారన్నారు.దేశానికి స్వాతంత్ర్యం ‌సిద్దించి వజ్రోత్సవాలు జరుపుకుంటున్నప్పటికి పేద,బడుగు బలహీణ వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు.అంతేందుకు సమాజలో ఇంకా కులవివక్ష కొనసాగుతుందన్నారు.కుల‌వివక్ష దూరం అయినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం సిద్దించినట్లవుతుందన్నారు.రానున్న రోజులు బహుజనులదేనని రానున్న రోజుల్లో రాజ్యాధికారం సాధించి తీరుతామన్నారు.అంబేడ్కర్ రూపోందించిన రాజ్యాంగం ఇంకా పక్కా అమలు కావడం‌ లేదన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని  పాలకులు సక్రమంగా అమలు చేసినప్పుడే బలహీణ వర్గాలకు న్యాయం జరుగుద్దాన్నారు.ఈ కార్యక్రమంలో కళాకారులు ఆలపించిన గేయాలు ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గద్దర్ దరించి సూటు బూటు సబికులను దృష్టి అమితంగా ఆకర్శించింది.ఈ కార్యక్రమంలో బహుజన నేతలు మార్వాడి సుదర్శన్,జాకబ్, మాటూరి రత్నం, దాసరి ఉషా,కూరెల్లి స్వప్న గౌడ్,విశ్వం అందే స్వామి,విజయ తదితరులు పాల్గోన్నారు.