వరద బాదితుల ను ఆదుకున్న ప్రజాప్రతినిధులు, స్వంచ్చద సంస్థలు.

Published: Friday July 15, 2022
జన్నారం రూరల్, జూలై 14, ప్రజాపాలన:  
 
మండలంలో  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షలకు జనజీవనం అస్థావ్యస్థంగా మారింది. వాగులు , గోదావరి పొంగిపొర్లుతుండటం వలన లోతట్టుప్రాంలలో వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 గురువారం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో   స్థానిక తాహసిల్థార్ ఇట్యాల కిషన్ మండలంలో గోదావరి ముంపు నకు గురైన గ్రామలైన తపాలాపుర్, రోటిగూడ, తిమ్మాపూర్  గ్రామాల్లో పర్యటించి పరిస్థితి సమిక్షించి,నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు.  అదేవిధంగా స్థానిక ఎంపిడివో అరుణరాణి, ఎంపివో రమేష్, ముంపు గురైన కుటుంబ సభ్యులను కలిసి వివరాలు అడిగి తెలుకున్నారు. తిమ్మాపూర్ గ్రామ  సర్పంచ్ జాడి గంగధర్ వరద బాదితులకు త్రాగునీటి తదితర సౌకర్యాలు కల్పించారు. మండల కేంద్రంలో ని పునరావాస కేంద్రాల వద్ద గురువారం వైద్య శిబిరాలు ఎర్పాటు చేయడం జరిగిందని జన్నారం మండల ప్రభుత్వ వైద్యాదికారి డాక్టర్ ప్రసాద్ రావు తెలిపారు. పుట్టి గూడ, బుడిగజగ్గలు కాలిని ముంపు బాదితులకు పోన్కల్  సర్పంచ్ జక్కు భూమేష్  అన్నాదానం ఏర్పాటు చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ బాదంపల్లి అదర్యంలో మాజి సర్పంచ్ కాశేట్టి లక్ష్మన్, గ్రామ పౌరులు కలిసి వరద బాధితులకు పులిహోర ప్యాకేట్ లు అందజేశారు., జన్నారం ఉన్నత పాఠశాలలో  1998-99 సంవత్సరం పదవతరగతి బ్యాచ్ బృందం అద్వర్యం లో వర్షాల కు కప్పుకునే కవర్లు అందజే
శారు. కడెం ప్రాజెక్టు కింద లోతట్టు ముంపు ప్రాంతాలలో  ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు అజ్యీరా హరినాయక్,  జన్నారం మండల అధ్యక్షుడు గోలిచందు, మండల బిజేవైఎం నాయకులు ముడుగు ప్రవీణ్, కొండపల్లి మహేష్ పర్యటించారు., అదేవిధంగా జన్నారం మండల టిఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, మండల ఎంపిపి మాదడి సరోజణా మండల అధ్యక్షుడు రాజరా రెడ్డి వరద ముంపు బాదితులను పరమార్శించారు.