పరమత సహనమే లౌకిక దేశం లక్ష్యం

Published: Monday January 02, 2023
* అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు బాలకృష్ణ గురుస్వామి
వికారాబాద్ బ్యూరో 1 జనవరి ప్రజా పాలన : పరమత సహనమే భారతదేశ లౌకిక రాజ్యాంగానికి నిదర్శనమని అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు బాలకృష్ణ గురుస్వామి, రాధాకృష్ణ గురుస్వామి, నాగని బుచ్చిరెడ్డి గురుస్వామి, ప్రేమ్ గాంధీ గురు స్వామిలు అన్నారు. ఆదివారం అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పిడి యాక్ట్ కేసు నమోదు చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం అయ్యప్ప జాయింట్ ఆక్షన్ కమిటీ సభ్యులు రాధాకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ బైరి నరేష్ రేంజర్ల రాజేష్ వేదికపై కూర్చున్న వారందరిపై పాత కేసులను పరిశీలించి పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్లను విమర్శించడం తూలనాడడం నాస్తికులకు ఒక వ్యసనంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి మతం వారిది ఎవరి ఆచారాలు వారివి ఏ మతం వారిని విమర్శించే హక్కు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించలేదని స్పష్టం చేశారు. ఒకరి ఆచార వ్యవహారాలలో కించపరిచే విధంగా మాట్లాడాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని గుర్తు చేశారు. హిందూ దేవుళ్లను ఆచార వ్యవహారాలను హిందువేతరులు విమర్శించడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఏ వేదిక పైనుండి అయ్యప్ప స్వామి జనన మూలానికి సంబంధించిన అనుచిత వ్యాఖ్యలు చేశాడో ఆ ప్రాంతాన్ని ముక్కోటి ఏకాదశి సందర్భంగా పురస్కరించుకొని ఆవు పేడ ఆవు పంచకంతో శుద్ధి చేస్తామని అన్నారు. అపవిత్రమైన ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసి పవిత్రంగా మార్చుతామని చెప్పారు. అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ బహిరంగ క్షమాపణ చెబితే అతనితోపాటు వారి అనుచర గణానికి అయ్యప్ప మాలలు వేసి మా సొంత ఖర్చులతో దీక్షను పూర్తి చేయించి అయ్యప్పను దర్శించుకునేలా చేస్తామని వెల్లడించారు. హిందువులను తిట్టినా హేళన చేసిన వారు ఏమీ చేయలేరని ఆలోచించడం మూర్ఖత్వమని ఘాటుగా స్పందించారు. హిందూ సత్సంప్రదాయాలను అనుసరించి పరమతాలను గౌరవించే సంస్కృతి హిందూ మతానిదని చెప్పారు.