వాల్ రైటింగ్ పరిశీలిస్తున్న పొన్నం

Published: Tuesday October 25, 2022

బోనకల్, అక్టోబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 5 6 7 తేదీలలో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా డిసెంబర్ ఐదవ తారీఖున ఖమ్మంలో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మహాసభలను పురస్కరించుకొని గ్రామాలలో ప్రచార నిమిత్తం బోనకల్ మండల కేంద్రంలో వాల్ రైటింగ్ ని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఆయనతోపాటు వ్యవసాయ కార్మిక సంఘం బోనకల్ మండల కార్యదర్శి బంధం శ్రీనివాసరావు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరావు ,బి వి కే నిర్వాహకులు శ్రీనివాసరావు ,సిపిఎం పార్టీ బోనకల్ గ్రామ కార్యదర్శి తెల్లాకుల శ్రీనివాసరావు, సిపిఎం సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ భూక్య జాలు, వార్డు నెంబర్ ఉప్పర శ్రీను ,పార్టీ నాయకులు చెన్నా లక్ష్యాద్రి తదితరులు పాల్గొన్నారు.