జెండా ఆవిష్కరణ

Published: Tuesday November 22, 2022

జన్నారం, నవంబర్ 21, ప్రజాపాలన: ప్రపంచం మత్స్యకార దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర సోమవారం ముదిరాజ్ మత్స్యకార సొసైటీ ఉపాధ్యాక్షుడు సిరవేణి పెద్దిరాజుం ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముదిరాజ్ సొసైటీ లో ముదిరాజులకు పూర్తిస్థాయిలో మత్స్యకార పథకాలు అందడం లేదన్నారు. మండలంలోని కవ్వాల్, చర్లపల్లి, కిస్టాపూర్, జన్నారం, పొన్కల్, చింతలపల్లి, బాదం పెళ్లి, చింతగూడ, తపాలాపూర్ పలు గ్రామాలలో 18 సంవత్సరాల నిండిన ముదిరాజులకు మత్స్యకార సొసైటీలో సభ్యత్వం కల్పించాలని ఆయన కోరారు. అదేవిధంగా చర్లపల్లి గ్రామంలో పెద్దమ్మతల్లి ఆలయంలో ముదిరాజ్ మహాసభ ఎనిమిదవ ముదిరాజ్ మహాసభ ఆవిర్భా దినోత్సవం, ప్రపంచ మత్స్యకర దినోత్సవం సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయంలో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు దండవేని చంద్రమౌళి ముదిరాజ్ జెండాను ఎగరవేగడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ మంచిర్యాల యువజన విభాగం జిల్లా కార్యదర్శి ఐలవేణి నరసయ్య ముదిరాజ్, ముత్తంగి గంగన్న ముదిరాజ్, మామిడి రవి ముదిరాజ్, ఐలవేణి రవి ముదిరాజ్, సింగ సాని రాజన్న ముదిరాజ్, దండవేణి శ్రీధర్ ముదిరాజ్, సింగసాని సంతోష్ ముదిరాజ్, కుల బంధువులు పాల్గొన్నారు.