టీఎస్ యుటిఎఫ్ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరణ

Published: Thursday January 05, 2023

బోనకల్, జనవరి 4 ప్రజా పాలన ప్రతినిధి: యుటిఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో 2023 డైరీలు ,క్యాలెండర్ల బోనకల్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆవిష్కరించడం జరిగింది. మండల ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ ,ఎఫ్ ఎల్ ఎన్ మండల నోడల్ అధికారి బి చలపతిరావు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు బి రత్నకుమారి, బి హరి ప్రసాద్, బి జ్ఞానేశ్వర చారి, టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు డైరీ మరియు క్యాలెండర్ ని ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బీప్రీతం, గుగులోతు రామకృష్ణ, యుటిఎఫ్ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కోశాధికారి వల్లం కొండ రాంబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల గురించి ఎల్లవేళలా వెన్నంటూ ఉంటూ సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉంటామని అలాగే ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ప్రాతినిధ్యం వహిస్తున్నామని అన్నారు. ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమo విజయవంతం చేయడంలో ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు చంద్రప్రసాద్, గోపాలరావు, పుల్లారావు, రమేష్, శ్రీనివాసరావు, లక్ష్మి, రంగారావు, సీనియర్ నాయకులు సదా బాబు, జెవివి నాయకులు పిల్లలమర్రి అప్పారావు మండల యుటిఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.