హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఆత్మగౌరవాన్ని గెలిపించండి

Published: Friday August 13, 2021
కరీంనగర్, ఆగస్టు 12 (ప్రజాపాలన ప్రతినిధి) : హుజూరాబాద్ అంబేద్కర్ విగ్రహంకు దండ వేసిన అడ్వొకేట్స్ అనంతరం మాట్లాడుతూ 2014 ఎనికలల్లో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, రైతులకు 1 లక్షా రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి, ప్రతి ఉప ఎన్నికకు 50 వేల ఉద్యోగాలు, జి.హెచ్.ఎం.సి ఎన్నికలలో ఇంటికి 10 వెయ్యిలు ఇస్తా అని ఏది కూడా అమలుపర్చకుండా మళ్ళీ ఇప్పుడు హుజూరాబాద్ లో ఎన్నిక ఉంది కాబట్టి దళిత బందు  అంటూ కొత్తరాగం అందుకొని ఇది కూడా కొంత మందికే అని ఉద్యమ కారున్ని ఓడించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అని, ఉద్యమ ద్రోహానికి ఎమ్మెల్సీ ఇచ్చి, శంకరమ్మకు ఓడిపోయే సీటు ఇచ్చి ఓడించారని కెసిఆర్ అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న ఎన్నికలలో ప్రజా స్వామ్యంను గెలిపియలని అడ్వకేట్ లు కోరారు.  ఈ కార్యక్రమంలో సుంకే దేవకిషన్, బి.శంకర్, టి. భూమేష్, ఎస్.ప్రభాకర్, జె.రమేష్, బి.శ్రీకాంత్, డి.ఓంకార్, క్యాదాసి గోపి, గడ్డం సంజీవ్, ఎర్రోళ్ల రమేష్, చౌడమల్ల భాను కిరణ్ పాల్గొన్నారు.