గుండె జబ్బులపై అవగాహన సదస్సు

Published: Thursday September 30, 2021

వలిగొండ, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని దుప్పల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం వేములకొండ వైద్యాధికారి డాక్టర్ సుమన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గ్రామ ప్రజలకు గుండె జబ్బులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుండె జబ్బులపై అవగాహన కలిగి ఉండాలని పొగ అలవాటు, మధుమోహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఉబకాయం, గాలి కాలుష్యం వంటి ఇతర అనేక కారణాల అన్నారు. ముందు నుంచే తగుజాగ్రత్తలను తీసుకుంటే గుండె జబ్బును నివారించవచ్చని అన్నారు. ఒకవేళ జబ్బు తలెత్తిన  వీలైనంత త్వరగా గుర్తించడం సత్వరం వీలైన చికిత్సను అందించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు అన్నారు. గుండె పోటు గుండె ఆగిపోవడం గుండె వైఫల్యం ఒకటేనని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి అన్ని వేరు వేరు సమస్యలు కాకపోతే ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎమ్ఓ కృష్ణయ్య, హెచ్ఈఓ లక్ష్మయ్య, హెల్త్ అసిస్టెంట్లు జే సత్తయ్య, ఎన్ అనిత, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, ఆరోగ్య మిత్ర మహేందర్, ఆశా కార్యకర్తలు కవిత, యాదమ్మ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.