రైతుల పాలిట శాపంగా మారిన టీఆర్ఎస్ ప్రభుత్వం

Published: Tuesday June 01, 2021
పత్తా లేని జిల్లా కలెక్టర్, అధికారులు
కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి
సిద్దిపేట (ప్రజాపాలన ప్రతినిధి) : రైతుల పాలిట టీఆర్ఎస్ ప్రభుత్వం శాపంగా మారిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డుకు తరలిస్తే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. రైతు ప్రభుత్వమని, రైతులకు రైతుబంధు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతులకు చేస్తుందేమి లేదన్నారు. తీరా పండించిన ధాన్యాన్ని రైతు మార్కెట్ యార్డుకు తరలిస్తే అక్కడ కనీసం అన్నం కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ లో రైతులకు తాగునీటి వసతి ఏర్పాటు చేయకపోవడం కూడా దారుణంగా ఉందని తెలిపారు. ఒక్కో రైతు దాదాపు 20 రోజులకు పైగా మార్కెట్ యార్డులో పడిగాపులు కాస్తున్నారని, అయినా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తుందన్నారు. ఇంత జరుగుతున్నా కనీసం జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు కూడా మార్కెట్ యార్డుకు వెళ్లి సందర్శంచడం లేదని, ధాన్యం కొనుగోలు పై అశ్రద్ధ వహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దరిపల్లి చంద్రం మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సయ్యద్ అతిక మాజర్ మాలిక్. గ్యాదరి మధు మున్నా. హబీబ్. ఫయాజ్ అభినవ్. గఫూర్. అజార్ ఆయూబ్. తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు