గోదావరి వరద ప్రాంత ప్రజలకు నేటికీ అందని 10000 రూపాయలు ఆర్థిక సహాయం

Published: Tuesday October 11, 2022

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ప్రజా పాలన.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని ముంపు ప్రాంత ప్రజలకు గత జులై, ఆగస్టు నెలలో వచ్చినటువంటి వరదల కారణంగా దెబ్బతిన్నటువంటి ఇండ్ల నష్టపరిహారాలు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం పదివేల రూపాయలు నేటికీ అందలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఇండ్లు కూలిపోయి విపరీతమైన ఆస్తి నష్టం సంభవిస్తే ప్రభుత్వం 10000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అయితే ప్రకటించినటువంటి 10000 రూపాయలు కొంతమంది ఎకౌంట్లోనే పడి మిగతా కొంతమంది ముంపు ప్రాంత బాధితులకు డబ్బులు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు వారిని అడిగితే మీకు పెయిడ్  చూపస్తున్నదని , రెవిన్యూ డిపార్ట్మెంట్ వారిని అడిగితే ఇంకా వస్తాయి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వండి అని వారు చెబుతున్నారని ,బ్యాంక్ స్టేట్మెంట్లు ఇచ్చినా గాని నేటికీ ఎకౌంట్లో  డబ్బులు పడకపోవడం ఏంటని ముంపు ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరివిని డిపార్ట్మెంట్ వారు మాత్రం మాకేమి సంబంధం లేదన్నట్లు చేతులు దులుపుకుంటున్నారని ఏమాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఇదేంటి అని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అడిగితే మేము కలెక్టర్ గారికి పంపించాము అని చెప్పడం జరిగినది. ఇకనైనా ప్రభుత్వం ప్రకటించినటువంటి 10000 రూపాయలు త్వరితగతిన ముంపు ప్రాంత ప్రజలకి వచ్చేలా చూసి మమ్మల్ని ఆదుకుంటారని ప్రజలు కోరుతున్నారు.