గిరిజన యువతి కుటుంబానికి న్యాయం చేయాలి

Published: Monday November 29, 2021
బెల్లంపల్లి  నవంబరు 28 ప్రజాపాలన ప్రతినిధి: నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన గిరిజన యువతిని ప్రేమ పేరుతో మోసం చేయడం తో ఆత్మహత్యకు పాల్పడిందని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బెల్లంపల్లి అఖిలపక్షం నాయకులు గెల్లి జయరాంయాదవ్, కాశీ సతీష్ కుమార్లు డిమాండ్ చేశారు. ఆదివారం నాడు స్థానిక బాబు క్యాంపు బస్తి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మైలారం గ్రామానికి చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి యువతి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జంబి శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నతాధికారులకు పిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు శ్రీనివాస్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఇది సరైంది కాదన్నారు. యువతికి జరిగిన అన్యాయం విషయంపై ఎస్సీ, ఎస్టీ కమీషన్, మానవ హక్కుల సంఘానికి, డీజీలకు ఫిర్యాదు చేశాడని. పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తూ శ్రీనివాస్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని. గిరిజన యువతి కుటుంబానికి అండగా నిలిచిన వారిపై అక్రమంగా కేసులు నమోదు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. మగవారు ఎవరు లేని సమయంలో పోలీసులు ఇంట్లోకి చొరబడి మహిళలను భయభ్రాంతులకు గురి చేయడం సరైంది కాదన్నారు. శ్రీనివాస్ పై అక్రమ కేసులు ఎత్తివేసి బాధిత యువతి కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆం దోలనలు, రాస్తారోకోలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు మహేష్ బాబు, కవిరాజు పాల్గొన్నారు.