ప్రమాదం అంచున బోర్గి తండా బోర్ మోటార్ స్టార్టర్

Published: Saturday April 16, 2022
హైదరాబాద్ 15 ఏప్రిల్ ప్రజాపాలన: ప్రమాదం అంచున బోర్ మోటార్ స్టార్టర్ డబ్బాలు. చాలా గ్రామాలలో బోర్ మోటార్ స్టార్టర్ డబ్బాలు నోరు తెరచి ఉంటున్నాయి. దీనివల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గి తండా లోని బోర్ మోటార్ స్టార్టర్ డబ్బాకు మూత లేక పొడం వలన ప్రమాదకరంగా మారింది. పక్కనే ప్రాథమిక పాఠశాల ఉన్నది. స్టారర్ కు మూత లేని కారణంగా చిన్నారులు ఎవరైనా స్టార్టర్ ను తాకినచో విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉంది.  గ్రామ  పంచాయతీ కార్యదర్శి వెంటనే తగిన మరమ్మతు చేయించి  ప్రమాదం జరగకుండా  చూడాలని  ప్రజలు కోరుకుంటున్నారు.