గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇవ్వడంపై ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుని కలిసిన

Published: Monday October 17, 2022
 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  ని ఘనంగా సన్మానించిన... పినపాక నియోజకవర్గం సేవాలాల్ సేన బంజారా నాయకులు
 ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు  ను ఆదివారం నాడు పినపాక నియోజకవర్గం సేవాలాల్ సేన బంజర నాయకులు సీఎం కేసీఆర్  గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్  ఇవ్వడంతో పాటు బంజారా భవన నిర్మాణం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేయడం జరిగింది...
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ  

 జనం కోసం పనిచేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు, గిరిజనులకు 10% రిజర్వేషన్ ఆయనతోనే సాధ్యమైందని చెప్పారు, గిరిజనులకు గిరిజన బంధు ఇప్పించడం గిరిజనుల ఆత్మగౌరవ ప్రత్యేకగా హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ లో సేవాలాల్ బంజారా భవన్, మరియు కొమరం భీమ్ ఆదివాసి భవనాలను నిర్మించి జాతికి అంకితం చేసిన గొప్ప మనసు గల మహానీయుడు సీఎం కేసీఆర్ అని అన్నారు, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అని ఆయన గుర్తు చేశారు.సేవలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వ అధికారకంగా నిర్వహిస్తున్నదని అన్నారు.దళిత బంధు మారుతీరిగా పేద గిరిజనుల కోసం సీఎం కేసీఆర్  గిరిజన బంధు ప్రకటించడం సంతోషకరమన్నారు. గిరిజనలు ఎన్నో ఏల్లగే ఎదురుచూస్తున్న కలను సీఎం కేసీఆర్ ప్రకటనలతో సహకారమైందని ఈ పథకం గిరిజన జీవితాలలో వెలుగులు నింపుతున్నది, పోడు రైతులకు హక్కు పత్రాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పోడు రైతులకు న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్  పోడు సర్వే చేపట్టారని  ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.