అత్యున్నత సేవలు అందిస్తున్న వాసవి క్లబ్స్ - అంతర్జాతీయ వాసవి క్లబ్ కార్యదర్శి ఇరుకుల్ల రామక

Published: Monday January 09, 2023
మంచిర్యాల. బ్యూరో, జనవరి 08, ప్రజాపాలన : 
 
 
అంతర్జాతీయ స్థాయిలో అనేక రకాల సేవా కార్యక్రమాలను అందిస్తూ అత్యున్నత సేవలకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతిరూపంగా నిలుస్తున్నాయని అంతర్జాతీయ వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి ఇరుకుల్ల రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం హాజీపూర్ మండలంలోని వేంపల్లి ఎస్వీఎస్ కన్వర్షన్ హాల్లో జిల్లా క్యాబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ కొండా చంద్రశేఖర్ సభాధ్యక్షులుగా వ్యవహరించగా ముఖ్య అతిథి మాట్లాడుతూ , వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. క్లబ్ సభ్యుల సహకారంతో నిరుపేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించడానికి సరస్వతి పథకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ప్రతి సంవత్సరం లక్షల రూపాయల విలువ చేసే పుస్తకాలను కెసిజిఎఫ్ పథకంలో భాగంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు . అలాగే వాసవి కుటుంబ సురక్ష పథకం ద్వారా మరణించిన క్లబ్ సభ్యుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని అన్నారు.  చేయూత పథకం ద్వారా నిరుపేదలకు వ్యాపార పరంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ వారి ఉన్నతికి ముఖ్య భూమిక పోషిస్తున్నట్లు గుర్తు చేశారు. అనేక సేవా కార్యక్రమాలను నిరుపేదల కోసం చేపడుతూ ప్రపంచవ్యాప్తంగా వాసవి క్లబ్ సేవలను అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కొండ చంద్రశేఖర్ క్యాబినెట్ లోని వివిధ స్థాయిల అధికారులతో పాటు జిల్లాలోని వివిధ వాసవి క్లబ్ల అధ్యక్ష , కార్యదర్శి , కోశాధికారులలతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ కొండ చంద్రశేఖర్, కార్యదర్శి అప్పిల శ్రీధర్, కోశాధికారి అక్కెనపల్లి నాగరాజు, అంతర్జాతీయ వాసవి క్లబ్ అధికారులు ముక్త శ్రీనివాస్ , రేణికుంట్ల శ్రీనివాస్ , కటకం హరీష్ , సిరిపురం సత్యనారాయణ , ఆవునూరి శివలీల , పవిత్రం శ్రీనివాస్ , ఎక్కిరాల శ్రీనివాస్,  కలికోట శ్రీనివాస్ , బాల సంతోష్ తోపాటు జిల్లా అధికారులు ఆదిత్య మించిన మంచిర్యాల వాసవి క్లబ్ , వనితా క్లబ్ , యూత్ క్లబ్,  కపుల్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారిలు జిల్లాలోని రీజియన్ చైర్మన్లు , జోన్ చైర్మన్ తోపాటు మంచిర్యాల , ఆసిఫాబాద్ , భూపాలపల్లి , పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా నుంచి విచ్చేసిన వాసవి క్లబ్ నాయకులు పాల్గొన్నారు.