ఇంటర్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలి.

Published: Tuesday March 23, 2021
విద్యార్థులకు న్యాయం చేయాలి.
మధిర మార్చి 22 ప్రజాపాలన ప్రతినిధిఖమ్మం :- ఇంటర్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని SFI ఖమ్మం జిల్లా అధ్యక్షులు వడ్రాణపు మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ :- ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కరోనా రోజురోజుకీ పెరుగుతూ ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాల, కళాశాల, హాస్టల్ లో ఉన్నటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి మరియు తల్లిదండ్రులకు కూడా వ్యాపించింది. అదేవిధంగా ఇప్పటివరకు ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో తరగతులు జరగకుండానే, సిలబస్ పూర్తి కాకుండానే పరీక్ష ఎలా నిర్వహిస్తారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యం అయినటువంటి ప్రాక్టికల్స్ పరీక్షలు పేరుతో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కళాశాలల పైన చర్యలు తీసుకోవాలి. మరియు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరిలో నిర్వహించినటువంటి డిగ్రీ థర్డ్ సెమ్ ఫలితాలను విడుదల చేయలేదు. దీంతో విద్యార్థులు అయోమయ స్థితిలో పడి మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి కూడా గందరగోళంగా ఉన్నది... దీనిలో భాగంగానే డిగ్రీ సెమ్, ఫిఫ్త్ సేమ్ పరీక్షలు రాసే అటువంటి  విద్యార్థులు కూడా కరోనా బారిన పడడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు వలన విద్యార్థులకు చాలా నష్టం చేసే పరిస్థితి ఉంది.. ఈ సమయంలో విద్యార్థులు అందరూ కూడా ఒక వైపు ఇంటిదగ్గర, మరోవైపు ఐసోలేషన్ కేంద్రంలో చికిత్స తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో పరీక్షలు ఎలా నిర్వహిస్తారు.? విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు.? ప్రభుత్వం ఆలోచించాలి...? కావున విద్యార్థులకు నష్టం జరగకుండా డిగ్రీ పరీక్షలను, ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయాలి... ఈ కార్యక్రమాల్లో గణష్, పేరు స్వామి, రాజేష్, సాయి, నితిన్ రవి తదితరులు పాల్గొన్నారు...