సిపిఎం సీనియర్ నాయకుడు పిచ్చయ్య మృతి

Published: Monday October 11, 2021
బోనకల్, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోనే చిరునోముల గ్రామానికి చెందిన సిపిఎం తొలి తరం సీనియర్ నాయకుడు నీలం పిచ్చయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు మృతునికి భార్య ఒక కుమారుడు ఉన్నారు పిచ్చయ్య కమ్యూనిస్టు పార్టీకి రెండుసార్లు శాఖ కార్యదర్శిగా పని చేసాడు. కమ్యూనిస్టు పార్టీ చీలిక అనంతరం సిపిఎం లో చేరాడు. సీపీఎం పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించాడు. గ్రామంలో సిపిఎం అభివృద్ధికి నిరంతరం కృషి చేశాడు. మృతి చెందే వరకు సిపిఎం పార్టీలోనే ఉన్నాడు. కుటుంబాన్ని కూడా సిపిఎం లోనే ఉండేవిధంగా తీర్చిదిద్దాడు. చిరునోములలో జరిగిన అనేక సమస్యలపై కీలక పాత్ర నిర్వహించాడు. పేద ప్రజల అభివృద్ధికి నిరంతరం శ్రమించాడు. పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక అడ్డంకులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటూ సిపిఎం పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర నిర్వహించాడు. గ్రామంలో అనేక మంది యువకులను చైతన్య పరుస్తూ సిపిఎం లో కార్యక్రమాలలో పాల్గొనే విధంగా కృషి చేశాడు. ఇటీవలే ఖమ్మం లో ఉంటున్న తన పెద్ద మనవడు వద్దకు వెళ్ళాడు. అక్కడే అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహాన్ని చిరునోముల గ్రామం తరలించారు. చిరునోముల లోనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహంపై సిపిఎం పతాకాన్ని ఉంచి ఆ పార్టీ గ్రామ శాఖ నివాళులర్పించింది. మృతదేహాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు చిరునోముల సిపిఎం శాఖ కార్యదర్శి నిమ్మల రామారావు, మాజీ శాఖ కార్యదర్శి సత్యాల వెంకటరామయ్య చిరునోముల మాజీ ఎంపీటీసీ నిమ్మ తోట ఖానా, మాజీ ఉప సర్పంచ్ నీలకంఠం రాము, గ్రామ సర్పంచ్ ములకారపు రవి, కాంగ్రెస్ మండల అధక్షుడు గాలి దుర్గారావు సిపిఎం సీనియర్ నాయకులు ముంగి వెంకన్న, గోళ్ల కోటేశ్వరరావు, వేమ రామయ్య, ఆకుల లక్ష్మయ్య, మర్రి రామారావు, అల్లిక రంగయ్య టీఎస్ యుటిఎఫ్ మాజీ నాయకులు నీలం లక్ష్మీనారాయణ, తదితరులు సందర్శించి నివాళులర్పించారు.