పట్టణ ప్రగతి లో కార్పొరేషన్ అభివృద్ధికి ప్రజలే మార్గదర్శకులు

Published: Wednesday July 07, 2021
బాలాపూర్, జులై 06, ప్రజాపాలన ప్రతినిధి : సమాజ అభివృద్ధికి ప్రజలే మార్గదర్శకులని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ డివిజన్ పరిధిలోని నవయుగ కాలనీ అధ్యక్షులు మురళి చారి అధ్యక్షతన జరిగిన హరితహారం కార్యక్రమానికి మంగళవారం నాడు స్థానిక కార్పొరేటర్ పెద్దబావి శ్రీనివాస్ రెడ్డితో పాటు ముఖ్యఅతిథిగా కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ....ప్రజల సహకారంతోనే కార్పోరేషన్ అభివృద్ధి, ప్రజలను ఉద్దేశించి సమాజ అభివృద్దికి ప్రజలే మార్గదర్శకులు అన్నారు. ప్రజల సహకారంతోనే అభివృద్దికి బాటలు వేస్తున్నట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా కార్పోరేటర్లు అందరూ పనిచేస్తున్నట్లు తెలిపారు. ఒకటవ డివిజనులో అభివృద్ది పనులకు సాధారణ నిధుల నుండి పదిలక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆశీస్సులతో బడంగపేట కార్పోరేషను అభివృద్ది చేస్తామని ఆమె అన్నారు. నవయుగ కాలనీలోని మహిళాభవన్ చుట్టూ రక్షణ తీగ ఫెన్సింగ్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. స్థానిక కార్పోరేటరు పెద్దబావి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.... తన డివిజన్ లో 12 కాలనీలలో మరింత అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. సాయి విహార కాలని అధ్యక్షులు కోలా శ్రీనివాస్, టి యస్ ఆర్ నగర్ కార్యదర్శి ఎస్ అశోక్ చక్రవర్తి మాట్లాడుతూ..... కాలనీలో భూగర్భ మురుగు నీటి పైప్ లైన్, సిమెంట్ రోడ్లు వంటి సమస్యలను పరిష్కరించాల్సిందిగా మేయర్ కు మెమోరాండమును కాలని సభ్యులతో కలిసి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏ.ఇ. బిక్కు నాయక్, సాయివిహార్ కాలనీ అధ్యక్షులు కోలా.శ్రీనివాస్, టి.యస్.ఆర్ నగర్ కార్యదర్శి యన్.అశోక్ చక్రవర్తి, కాలని సభ్యులు ఎన్. శ్రీధర్, కృష్ణమాచారి, జయరాజ్, వేణుగోపాల చారి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.