108’లో మహిళ ప్రసవం

Published: Friday April 16, 2021
మధిర, ఏప్రిల్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం రామచంద్రపురంకు చెందిన వి.అనూష (22).. ఈరోజు ఉదయం పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం  ఇవ్వగా మధిర 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నండ్రు మనోహర్ పైలెట్ కన్నేపోగు మణికుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పురిటి నొప్పులతో బాధపడుతున్న అనూషని అంబులెన్స్లోకి ఎక్కించుకొని మధిర ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకు వస్తుండగా మార్గమధ్యలో అనూషకి నొప్పులు ఎక్కువ కావడంతో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నండ్రు మనోహర్ అంబులెన్స్లో అనూష కు సుఖప్రసవం చేశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. అనూష మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మధిర ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకు వెళ్లడం జరిగింది. అనూష యొక్క బంధువులు మరియు హాస్పిటల్ సిబ్బంది, 108 సిబ్బందిని అభినందించారు.