కలకొడిమ దేవాలయ నిర్మాణానికి లక్ష విరాళం..

Published: Thursday March 31, 2022
జడ్పీటీసీ ప్రమీలకు అందించిన దాతలు..
తల్లాడ, మార్చి 30 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని కలకొడిమ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయం దేవస్థానానికే బిల్లుపాడు గ్రామానికి చెందిన రాయల నరసింహారావు, సతీమణి బాధ్రమ్మ వారి జ్ఞాపకార్థం కొరకు వారి కుమారుడు రాయల వెంకటేశ్వరావు, సతీమణి శ్రీరామ కృష్ణవేణి మండల జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, టిఆర్ఎస్ జోన్ అధ్యక్షుడు దిరిశాల దాసురావుకు బుధవారం లక్షానూట పదహారు రూపాయలు అందించారు. నగదును అందించిన దాతలకు జడ్పీటీసీ ప్రమీల దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ రుద్రాక్ష బ్రహ్మం, ఆత్మ డైరెక్టర్ కేతినేని చలపతిరావు, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఇంజo కృష్ణార్జునరావు, జక్కంపూడి వీరభద్రరావు, రైతుబంధు గ్రామ కమిటీ సమితి అధ్యక్షుడు మేడ నరసింహారావు, మేడ మోహన్ రావు, బాబు, నల్లమోతు సత్యం, జక్కంపూడి నాగేశ్వరరావు, వేమా శ్రీనివాసరావు, నల్లగట్ల నాగేష్, తడకమళ్ళ రవి, పాల్గొన్నారు.