ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమం నందు భరత్ స్కూల్ విద్యార్థి పుట్టినరోజు వేడుకలు

Published: Wednesday November 24, 2021
మధిర నవంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : మధిర భరత్ స్కూల్ పదవ తరగతి చదువుతున్న చింతల అయ్యప్ప పుట్టిన రోజు వేడుకలను ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమం నందుజరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు భరత్ సంస్థల అధినేత గౌరవనీయులు శ్రీ శీలం వెంకట్ రెడ్డి మరియు మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్రీమతి విద్యా లత విచ్చేసి చింతల అయ్యప్పను ఆశీర్వదించారు అనంతరం ఈ సందర్భంగాా మాట్లాడుతూఈ పుట్టినరోజు వేడుకల  జరుపుకుంటున్న అయ్యప్ప నిండు నూరేళ్ళు ఉండాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉండాలని కోరారు ఇలాంటి సేవా కార్యక్రమం అన్నదానం చేయడం వల్ల పలువురికి ఆదర్శంగా నిలిచారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప తల్లిదండ్రులు శివ కుమారి నాగ వేణు మరియు ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ వారి సతీమణి మరియు ఆర్కే ఫౌండేషన్ సభ్యులు మరియు వేల్పుల అంజు తాత కొప్పుల భరత్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.