వాడవాడలా ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు..

Published: Monday July 11, 2022
తల్లాడ, జులై 9 (ప్రజా పాలన న్యూస్):
 తల్లాడ మండలంలో బక్రీద్ పర్వదిన వేడుకలను ఆదివారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువకులు, పెద్దలు నూతన వస్త్రాలు ధరించి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వర్షం కూడా తెరప ఇవ్వడంతో ముస్లిం సోదరులు పండుగను సంతోషంగా, ఉల్లాసంగా జరుపుకున్నారు. మసీదుల్లో ముస్లిం మత పెద్దలు ఖురాన్ ను బోధించి వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు షేక్. ఈసూబ్, ముస్లిమ్స్ మెతపెద్దలు ,గాలిపు, మదర్, షేక్ జానీ, యాకూబ్ పాషా, మదర్, ఆటో జానీ, టైలర్ జానీ నజీర్, రఫీ, బాబా, బాసు, జానీ, కాజా మియా, ఇలియాజ్, పాసి, ఖాసిం , ఉన్నారు