ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవికి మద్దతుగా... రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ రాగం స

Published: Thursday March 04, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన : శేరిలింగంపల్లి డివిజన్ పరిధి పాపిరెడ్డి కాలనీలో పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఉమ్మడి హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణి దేవికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మోడల్ స్కూల్, పాపిరెడ్డి కాలనీ, మైత్రి మోడల్ స్కూల్, గిడ్డంగి, లింగంపల్లిలలో పట్టభద్రులకు కరపత్రం అందచేసి మాట్లాడుతూ విద్యావంతులుగా విద్యావంతురాలికే పట్టం కడదాం అని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి.సురభి వాణి దేవి గెలుపుకు కృషి చేసే విధంగా పని చేయాలన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాలు,చేపట్టిన అభివృద్ధిని ప్రతిఒక్క పట్టభద్రులకు తెలిపి, వారిని స్వయంగా కలిసి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం రానున్న 15రోజులు ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలాగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎంఎల్సీ అభ్యర్థి సురభి వాణిదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ రాగం సుజాత యాదవ్ ప్రిన్సిపల్ పి. రత్నకుమారికి, స్కూల్ ఉపాధ్యాయులకు కరపత్రం అందజేసి ఓటు అడగటం జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ యువనాయకులు రాగం అనిరుద్ యాదవ్, కె.రమేష్, పట్లోళ్ల నర్సింహా రెడ్డి, గణపురం రవీందర్, అలి, గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శేరిలింగంపల్లి, ప్రజాపాలన : శేరిలింగంపల్లి  డివిజన్ పరిధిలోని సభ్యత్వ నమోదు పుస్తకాలను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే & ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీకి శేరిలింగంపల్లి డివిజన్ యువ నాయకులు రాగం అనిరుద్ యాదవ్ అందించటం జరిగింది. ఈ సందర్భంగా యువ నాయకులు  రాగం అనిరుద్ యాదవ్ ఇప్పటి వరకు క్రియాశీల సభ్యత్వాలు 1200, సాధారణ సభ్యత్వాలు 1800 వరకు మొత్తం 4000 చేసామని ఇంకా వెయ్యి సభ్యత్వాలు వరకు చేసేవి ఉన్నాయని ఎమ్మెల్యేకి తెలపటం జరిగింది.