గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం, హత్య చేసిన కిరాతకులను కఠినంగా శిక్షించాలి

Published: Tuesday June 01, 2021
- ఎఐబిఎస్ఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ 
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి తక్షణం ఆదుకోవాలని అల్ ఇండియా బంజారా సేవ సంఘ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, ధర్మరాం గ్రామం గుగులోత్ తండా సమీపంలో గిరిజన మైనర్ బాలిక ఉష పై కిరాతకంగా అత్యాచారం చేసి, ఆపై కిరాతకంగా హత్య చేసిన వారిని ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి మరియు సమగ్ర విచారణ చేపట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టంలోని లోపాలను సరిదిద్ది, దిశకు చేసిన న్యాయమే ఉషకు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కేవలం పత్రికా ప్రకటన వరకే పరిమితం కాకుండా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సహాయం అందించి, న్యాయ విచారణ జరిపి, వెంటనే శిక్ష పడే టట్లు తమ కార్యాచరణ ఉండాలని, ఎఐబిఎస్ఎస్జి ల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన సంఘాల అందరినీ కలుపుకొని న్యాయపోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గత ఐదారు సంవత్సరాల నుండి గిరిజనులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న ప్రభుత్వం తగిన విధంగా స్పందించడం లేదు మరియు బాధిత కుటుంబాలకు ఎలాంటి  నష్టపరిహారాన్ని కూడా ఇవ్వడం లేదని ఎఐబిఎస్ఎస్ ఆరోపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి సంఘటనల పై ఎస్పీ, కలెక్టర్లు మంత్రులు, గిరిజన శాఖకు సంబంధించిన అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గిరిజనులకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలకు అండగా ఉండి దుండగులు ఎవరైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని దోషులను కఠినంగా శిక్షించి మరణశిక్ష కూడా విధించే విధంగా కార్యాచరణ ఉండాలని అఖిల భారత బంజారా సేవ సంఘ్  ప్రభుత్వాన్ని డిమాండ్.