సామార్థ్యాల పెంపుదలకు లిటరసి అండ్ న్యూమరాసి ప్రోగ్రాం (తోలిమెట్టు) జిల్లా విద్యాధికారి డాక

Published: Friday August 05, 2022

కోరుట్ల, ఆగస్టు 04 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలంలోని రష్మిధర్ తేజ బి.యి.డి కాలేజ్ లో ఫౌండేషన్ లిటరసి అండ్ న్యూమరాసి ప్రోగ్రాం (తోలిమెట్టు) పైన ప్రాథమిక ,ప్రాథమికోన్నత ఉపాధ్యాయులకు మండల స్థాయిలో రెండవ విడత మూడు రోజుల శిక్షణ కార్యక్రమం  నిర్వహించడం జరిగింది. తొలిమెట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి డాక్టర్ బి.జగన్మోహన్ రెడ్డి  మాట్లాడుతూ ప్రతి తరగతిలోని విధ్యార్థులు ఆయా తరగతులకు అవసరమైన కనీస సామర్థ్యాలను సాధింపజేసి తదుపరి తరగతి వారి సామార్థ్యాల సాధనకై అవసరమగు బోధన ప్రణాళికలు రూపొందించుకొని అమలు పరచడం గురించి ఉపాధ్యాయులకు వివరించారు. రిసోర్స్ పర్సన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తూ తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం యొక్క లక్ష్యాలు పాఠ్య పుస్తకాలను సరిగ్గా వినియోగించడం,సామార్థ్యాల సాధన ముఖ్యంగా, ప్రణాళిక బద్ధంగా బోధన చేయడం ముఖ్యం,చదవడం,రాయడం,చతుర్విధ ప్రక్రియలు చేయగలిగించేలా దృష్టి పెట్టడం అని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ నల్ల శంకర్,జిల్లా పర్యవేక్షకులు దాసరి జయంత్, రిసోర్స్ పర్సన్స్ అందే శివప్రసాద్,
యం.అశోక్, సిరిపురం శ్రీనివాస్, సోమా గంగాధర్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ పి.గంగాధర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.