కొండపల్లి శ్రీధర్ రెడ్డి కి కృతజ్ఞతలు

Published: Thursday February 18, 2021
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఫిబ్రవరి 17, ప్రజాపాలన: జూలూరుపాడు గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు చిలుకూరి రమేష్ ని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి నియమించడం జరిగింది, ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్నీ), బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేంకట కృష్ణారావు, కోత్తగూడెం టౌన్ అధ్యక్షుడు లక్ష్మ అగర్వాల్, హరహర, సతీష్, శ్రీనివాస్ మరియు  జిల్లా నాయకులు, మండల నాయకులు శాలువాతో సన్మానం చేశారు, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు కోనేరు నాగేశ్వరరావు, బిజెపి జిల్లా కోశాధికారి నున్న రమేష్, బీజేపీ జిల్లా కిసాన్మోర్చా ఉపాధ్యక్షుడు మదినేని సతీష్, జూలురుపాడు మండల అధ్యక్షుడు సిరపురపు ప్రసాద్, వుర్లమెట్టి రవి, భూక్య రాజేష్, మరియు జిల్లా నాయకులు, మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా చిలుకూరి రమేష్ మాట్లాడుతూ బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి కి, మరియు ఈ పదవి రావడం కోసం కృషి చేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులకు చిలుకూరి రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.