ఉచితం బియ్యం పంపిణీ కార్యక్రమం

Published: Friday April 23, 2021
పరిగి, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, దోమ మండల పరిధిలో ని ఐనాపూర్ గ్రాములో తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రైవేట్ ఉపాధ్యాయుల కుఉచితం బియ్యం పంపిణీ కార్యక్రమం సర్పంచ్ మల్లేశం, ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ బుగ్గయ్య బియ్యం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న అయినా పూర్ రేషన్ డీలర్ అనిత ఆధ్వర్యంలోఉపాధ్యాయులకు 25 కిలోల సన్నబియ్యం రెండు వేల రూపాయలుపంపిణీ చేయడం జరిగింది, కరోనా కష్టకాలం దుష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మన తెరాస ప్రభుత్వం పని చేస్తుందని కొనియాడారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోణ నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలను చూచి మీ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ప్రైవేట్ ఉపాధ్యాయులంతా ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.కార్యక్రమంలో ఈడీ గి రవికుమార్. సిద్ధిరాములు. ప్రహ్లాద్. ఎండి జిలాని.గౌస్ పాష. రామచంద్రయ్య. అనంతమ్మ.బీదర్. తదితరులుపాల్గొనడం జరిగింది