మధిరలో అన్ని ట్రైన్స్ ఆగాలి మాంకాళి శ్రీనివాస్

Published: Tuesday March 08, 2022
మధిర మార్చి 7 ప్రజాపాలన ప్రతినిధి : కరోనా ముందు మధిరలో ఆగే రైలు అన్నింటిని మధిరలో ఆపాలని వినతి పత్రం అందించిన పౌర సమాచార నిర్వాహకులు మహంకాళి శ్రీనివాసరావు కరోనా కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే వారు రద్దు చేసిన ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను మధిరలో నిలుపుటకు, మరియు జనరల్ టికెట్స్ ను స్పాట్ బుకింగ్ గా మార్చ వలెనని, మధిర మండల మరియు ఇతర మండలాల ప్రజలు రైల్వే శాఖను మరియు సంబంధిత అధికారులను కోరుతున్నారు రైల్వే ప్రయాణం సుఖవంతంగా ఉంటుందని సౌకర్యవంతంగా ఉంటుందని రేటు ప్రజలకు అందుబాటులో ఉంటుందని కోరుతున్నారు కరోనా కు ముందు ఉన్న అన్ని రైళ్లను మధిరలో stop ఇవ్వాలని ప్రజల విన్నపం మా ఈ విన్నపాన్ని మధిర రైల్వే స్టేషన్ మేనేజర్ శ్రీ ఆర్.వి కాశి రెడ్డికి చెప్పటం జరిగినది. ఆయన గారు సమస్య చెప్పగానే  స్పందించి సంబంధిత అధికారులకు, తెలియచేస్తానని చెప్పినారు. ఈ కార్యక్రమము పౌర సమాచార, సేవా కేంద్రము నిర్వాహకులు మహంకాళి వెంకట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగినది, ఈ కార్యక్రమములో మధిర వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు చల్లా సత్యనారాయణ, వాసవి క్లబ్ జిల్లా ఇన్చార్జి ఇరుకుల్ల సురేష్, గ్రేటర్ వాసవి క్లబ్ అధ్యక్షులు నందిగామ పురుషోత్తం, మధిర మండల ఆర్యవైశ్య సంఘం కోశాధికారి దొడ్డ శ్రీనివాసరావు, రిటైర్డ్ ఆర్టిసి ఎంప్లాయ్ చలువాది కృష్ణమూర్తి, మధిర ప్రముఖులు చెడే రామకోటేశ్వరరావు పాల్గొని ఈ కార్యక్రమమును విజయవంతం చేసినారు