పట్నంలో 23న మంత్రి కేటీఆర్ పర్యటన* మంత్రి జన్మదిన సందర్భంగా హరితహారం మెగా రక్తదాన శిబిరం ఏర్

Published: Wednesday July 20, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఈనెల 23న మున్సిపల్ ఐటి శాఖ మాత్యులు కేటీఆర్ పర్యటిస్తున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. జిల్లా మంత్రి సవితారెడ్డి తో కలిసి 29.5 కోట్ల అభివృద్ధి పనులకు కేటీఆర్ ప్రారంభిస్తున్నారని చెప్పారు. మంత్రుల పర్యటన ఏర్పాటుపై పార్టీ నాయకులు అధికారులతో ఎమ్మెల్యే వేరువేరుగా సమీక్షించారు. 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందు ఆయన ఇబ్రహీంపట్నం పర్యటన ఖరారు కావడంతో కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన చర్యల సవరించి ఎమ్మెల్యే సమీక్షించారు. ఇబ్రహీంపట్నం చెరువు కట్ట నుండి ఇండియన్ ఇండస్ట్రీల వరకు క్లస్టర్ కు 18 కోట్ల వ్యయంతో నిర్మించిన నాలు పలైన్ల రహదారి 4.20 కోట్లతో నిర్మించిన ఏన్టి గురుకుల కళాశాల  భవనాన్ని2.15 కోట్ల వ్యయంతో నిర్మించిన పోస్ట్ మెట్రిక్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని2.05 కోట్లతో నిర్మించిన కస్తూబా కార్యాలయం నూతన భవనాన్ని2.27 కోట్లతో మార్కెట్ యార్డులో చేపట్టనున్న అభివృద్ధి పనులు మంత్రుల చేతుల్లో మీదుగా ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 500 మందితో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు  రెండు లక్షల మొక్కలు నాటిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పర్యటించే రూట్ మ్యాప్ ను యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.  మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకట్ రమణారెడ్డి, ఎంపీపీ కృపేష్, జడ్పిటిసి జంగమ్మ, టిఆర్ఎస్ అధ్యక్షులు చిలుక బుగ్గ రాములు, కర్నాటి రమేష్, చీరాల రమేష్, కిషన్ గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సిద్ధంకి కృష్ణారెడ్డి, అల్వాల్ వెంకట్ రెడ్డి, కొప్పు జంగయ్య, అమరేందర్ రెడ్డి, యువజన విభాగ అధ్యక్షుడు జెర్కోని రాజు, తదితరులు పాల్గొన్నారు