కార్మిక సమస్యల పరిష్కారానికి ఆగస్టు 3న జరిగే చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి* *డి.కిషన్ సీ

Published: Friday July 29, 2022

ఇబ్రహీంపట్నం జూలై 28 ప్రజాపాలన ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను సవరించాలని విడుదల చేసిన ఐదు జీవోలను వెంటనే గెజిట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆగస్టు 3న చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు సిఐటియు తుర్కయంజాల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిఐటియు కార్యాలయంలో "గోడ పత్రిక" విడుదల చేసి, అనంతరం వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి. కిషన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల చట్టం పరిధిలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ ఉన్నాయని వీటిలో సుమారు కోటి మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు సవరించాల్సి ఉందని అన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడిచినా టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కార్మికుల కనీస వేతనాలు సవరించలేదు. కార్మికుల పోరాటాల ఫలితంగా 2021 జూన్ నెలలో ఐదు జీవోలను విడుదల చేసిందనీ కానీ ఆ జీవులను గెజిట్ చేయకపోవడం శోచనీయమని అన్నారు. వెంటనే వాటిని గెజిట్ చేయాలని, మిగిలిన 68 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాలు జీవోలను సవరించాలని, బీడీ, హమాలీ, భవన నిర్మాణం, ట్రాన్స్పోర్ట్ రంగాల కార్మికులతో పాటు ఇతర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా తుర్కయంజాల్ ప్రాంతంలో ఉన్న వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు గాని ఈఎస్ఐ పిఎఫ్ లాంటి చట్టబద్ధ సౌకర్యాలు కూడా కల్పించే పరిస్థితిలో యాజమాన్యాలు లేవని కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.     కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ,ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా  అనేక పోరాటాలు నిర్వహించామని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరినీ మార్చుకోక పోగా కార్మిక వ్యతిరేక విధానాలను ఏదేచ్ఛగా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 3న సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గుర్రం జంగయ్య, కొండిగారి శంకర్, పగిళ్ల మధు, నక్మల్ల యాదగిరి, రమేష్, శ్రీశైలం, మహేందర్, నర్సింహారెడ్డి, శేఖర్ రెడ్డి, శంకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.