అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో కౌకుంట్ల గ్రామ పాఠశాలల్లో 4 తరగతి గదులను ప్రారంభించిన, మంత్ర

Published: Thursday October 06, 2022

చేవెళ్ల  ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ఇంద్రన్న,

చేవెళ్ల, అక్టోబర్ 04 ( ప్రజా పాలన)

చేవెళ్ల,ముద్దు బిడ్డ ,మాజి హోం మంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల గ్రామంలోని ఇంద్రన్న సమాధి వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి,చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య  నివాళలర్పించారు
అలాగే చేవెళ్ల,చిట్టంపల్లి గేటు,ఖానాపూర్ గేట్ వద్ద స్వర్గీయ ఇంద్రన్న విగ్రహాలకు పూల మాలలు వేశారు. మన ఊరు మన బడి  కార్యక్రమంలో భాగంగా అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన పాఠశాల లో నాలుగు తరగతి గదులను  మంత్రి సబితా ఇంద్ర రెడ్డి,ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ ఇంద్రన్న పుట్టి పెరిగిన గ్రామంలో జయంతి రోజున కోటి రూపాయలతో నిర్మించిన 4 తరగతి గదులను ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు.
ఇంద్రారెడ్డి శివరాం పల్లిలో  చదువుకునేటప్పుడు పరీక్షల ఫీజు చెల్లించటానికి ఆఖరి రోజున డబ్బులు లేకుంటే సైకిల్ మీద కౌకుంట్లకు వచ్చి డబ్బులు తీసుకొని తిరిగి సైకిల్ పై వెళ్లి ఫీజు చెల్లించారని గుర్తు చేసుకున్నారు. ఆనాడు విద్యా కోసం ఇంద్రారెడ్డి చాలా కష్టాలు పడ్డారని,నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యాకు పెద్ద పీట వేస్తున్నారన్నారు.అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.తెలంగాణలో వెయ్యికి పైగా గురుకులాలు నెలకొల్పి అందులో అన్నింటినీ ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేశారని మంత్రి తెలిపారు. గురుకులాలకు బాగా డిమాండ్ ఏర్పడిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ బడులను కూడా గురుకులాల వలె తీర్చిదిద్దటానికి అదేశించారన్నారు.
తెలంగాణ లాంటి పాలన దేశమంతా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అందుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ వేసే అడుగులో మనం అందరం అడుగు వేసి కెసిఆర్ కు అండగా నిలబడాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్  జాతీయ పార్టీ ప్రకటించనున్న నేపథ్యంలో మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని రైతులు తెలంగాణ రాష్టం వలె 24 గంటల ఉచిత విద్యుత్,రైతు బంధు,రైతు భీమా కోరుకుంటున్నారని అన్నారు.అడబిడ్డల పెళ్లిళ్లకు ఇస్తున్న కల్యాణ లక్ష్మి, షాది ముబారాక్ తో పాటు వివిధ రకాల పెన్షన్లు 2 వేల నుండి 3 వేల వరకు దేశమంతా ఇవ్వాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.తెలంగాణ వలె స్వచ్ఛ పట్టణాలు,పల్లెలు భారత దేశంలో రావాలంటే కేసీఆర్ పాలన రావాలన్నారు.దసరా పర్వదినం సందర్భంగా జాతీయ పార్టీ ప్రకటించనున్న సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజల మద్దతు కేసీఆర్కుఉంటుందన్నారు.ఇంటింటికి నల్లా ఇచ్చిన మిషన్ భగీరథ పథకంతో పాటు,మిషన్ కాకతీయ లాంటి పథకాలు దేశం అంతా అమలు కావాలంటే దేశంలో తెలంగాణ పాలన రావాలని,ఈ దిశలో దసరా పర్వదినం నాడు జాతీయ రాజకీయాలలో వేస్తున్న తొలి అడుగు విజయవంతం కావాలని ఆకాంక్షించారు
కౌకుంట్ల గ్రామంలో పాఠశాల అభివృద్ధి లో భాగంగా నిధులు అందించిన అరబిందో ఫార్మా కంపెనీ  ప్రతినిధి సదానందరెడ్డిని మంత్రి సన్మానించి, కంపెనీ సభ్యులను అభినందించారు
అదేవిధంగా 5 కోట్లతో  కౌకుంట్ల గ్రామంలో రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ముందుకు వచ్చిన
ఎన్ సిసి సంస్థ వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య నిధుల నుండి 50 లక్షలతో గ్రామంలో కమ్యూనిటీ  హాల్ నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి,ఎంపీపీ విజయలక్మి రమణారెడ్డి,జడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి,వైస్ ఎంపీపీ ప్రసాద్, ఫార్మా కంపెనీ ప్రతినిధి సదానంద రెడ్డి ,ఆర్జేడీ విజయలక్మి ,డి ఈ ఓ సుశీందర్ రావు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి కృష్ణారెడ్డి విట్ట వెంకట రంగారెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ కౌకుంట్ల గ్రామ సర్పంచ్ కండ్లపల్లీ గాయత్రి గోపాలకృష్ణ ,ఉప సర్పంచ్,ఇనాయత్, టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి చటరి దశరథ్, వివిధ గ్రామాల సర్పంచులు, టిఆర్ఎస్ యువ నాయకులు
నారే గూడెం అంజనేయులు ,ఉదయ్,శివ, ప్రశాంత్ ,ప్రవీణ్ వార్డు మెంబర్లు,తదితరులు గ్రామ ప్రజలు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు