ఐదవ రోజు కు చేరిన అఖిలపక్షం పార్టీ ల రిలే నిరాహార దీక్ష

Published: Saturday July 03, 2021
మధిర, జులై 02, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పోస్ట్లు భర్తీ చేయాలని కోరుతూ అఖిలపక్షం పార్టీ ల ఆధ్వర్యంలో ఐదో రోజు కు చేరిన రిలే నిరాహార దీక్ష, ఈ  దీక్షలో కూర్చున్న వారు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంగర వెంకటేశ్వర రావు, కరివేద రాంబాబు, టీడీపి పార్టీ నుంచి పాశం రామనాధం, కోనేరు రాణి, సీపీఐ పార్టీ అన్నవరపు సత్యనారాయణ, పూట్ల కొండలరావు.ఈ దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన వారు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, సీపీఐ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బెజవాడ రవి బాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు,టీడీపీ అధికార ప్రతినిధి గడ్డం మల్లికార్జునరావు, బీజేపీ పార్టీ నుంచి జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచెం కృష్ణారావు, దీక్ష ను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ.ఐదు రోజుల నుంచి దీక్ష చేస్తున్న ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు లేదు అని మధిర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి డాక్టర్స్ ను నియమించాలి అని లేని పక్షంలో ఆమరణ నిరాహారదీక్ష కు సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మిరియాల రమణ గుప్తా, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, ముస్లిం వెల్ఫేర్ కమిటి అధ్యక్షుడు మొహమ్మద్ అలీ, ఆదిములం, సీపీఐ, టీడీపీనాయకులు, మొదలగువారు పాల్గోన్నారు..