ప్రతి ఒక్కరుఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం

Published: Friday December 02, 2022

మధిర రూరల్ డిసెంబర్ 1 రూరల్ ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంమధిర ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఎయిడ్స్ ర్యాలీ మరియు సమావేశంలో మధిర న్యాయశాఖఅసిస్టెంట్ సివిల్ జడ్జ్  టి కార్తీక్ రెడ్డి వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఈ సందర్భంగామాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న హెచ్ ఏ ఎయిడ్స్ వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే రక్తమార్పిడి సమయంలోనూ, సురక్షితమైన సంభోగము, సురక్షితమైన సిరంజీలు ఉపయోగిస్తూ ఎయిడ్స్ వైరస్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్త వహించాలని, పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ప్రభుత్వము ద్వారా మంచి డ్రగ్స్ ఇస్తున్నామని, భయపడవలసిన అవసరం లేదని, వైరస్ లోడును తగ్గించుకోవచ్చని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు హెచ్ఐవి పై ఆరోగ్య అవగాహన కల్పించాలని, ప్రతి గర్భిణీ స్త్రీకి హెచ్ఐవి పరీక్ష తప్పనిసరిగా చేయించాలని తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో భాగంగా కిడ్లి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ అనూష రెడ్డి ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ కరపత్రాలు 1000 పంచడం జరిగినది.. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుష్పలత ,డాక్టర్ శ్రీనివాస్ రావు ,డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శశిధర్ , అడ్వకేట్ ఎం సతీష్, వై సుజాత, ఐ టి సి టి సిబ్బంది సాల్మన్ రాజు, మాటూరుపేట, దెందుకూరు, మధిర హాస్పిటల్స్ ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది,ఆరోగ్య పర్యవేక్షణ అధికారులు, టీఎన్జీవో అధ్యక్షుడు సుదర్శన్ పాల్గొన్నారు.