రావణాసుర మహారాజ్ ప్రతిమ దహనం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

Published: Thursday October 29, 2020
వలిగొండ ప్రజాపాలన మండల కేంద్రంలో,మండలంలోని వివిధ గ్రామాల్లో మా దళిత ఆదిపురుషుడు రావణాసుర మహారాజ్ ప్రతిమ దహనం ప్రతి సంవత్సరం చేపడుతున్నారని,ఇలాంటి కార్యక్రమాలు జరుపవద్దని అంబేద్కర్ దళిత జాగృతి యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం పిర్యాదు చేశారు.మా కుల దైవం అయినటువంటి రావణాసుర మహారాజ్ దహనం కార్యక్రమం నిర్వహించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఈ కార్యక్రమంలో పోలేపాక కిషోర్,పోలేపాక మత్స్యగిరి,ఎర్ర మహేష్,కందుల భాస్కర్,పోలేపాక శ్రీనివాస్,పోలేపాక సునీల్,  దేశపాక సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.